ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు 170 కి.మీ అగ్నేయంగా కేంద్రీకృతమై తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఒడిశావైపు కదులుతోందని వాతావరణశాఖ అధికారులు సమాచారమిచ్చారు. మరో 24 గంటల్లో వాయుగుండం కాస్త తుపానుగా మారే అవకాశముందని.. ఆ ప్రభావం ఏపీపై ఎక్కవగా ఉంటుందని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. అలాగే విశాఖ ఓడరేవులో ఒకటో నెంబర్ ప్రమాదం హెచ్చరికలు జారీ అయ్యయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Mobile AppDownload and get updated news