అణ్వస్త్ర సామర్థ్యంగల పృథ్వి-2 క్షిపణిని భారత్ డీఆర్డీఓ అధికారులు బుధవారం నాడు విజయవంతంగా ప్రయోగించారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది 350 కిలోమీటర్ల దూరం వరకు అణ్వస్త్రాలను మోసుకుని పోయి లక్ష్యాలను గురిచేసి చేదించగలదు. బుధవారం నాడు ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుండి దీన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్డీవో ప్రకటించింది. దాదాపు వేయి కిలోల వరకు వార్ హెడ్లను ఇది మోయగలదని అధికారులు తెలిపారు.
Mobile AppDownload and get updated news