Mobile AppDownload and get updated news
ముంబయి వీధులపై ఆ రోజు ఒక వృద్ధ ఉస్తాద్ హార్మోనియం వాయిస్తూ తన తీయనైన స్వరంతో చక్కని పాటలు పాడుతున్న దృశ్యం కొద్దిసేపు అటుగా వెళ్తున్న ముంబయి వాసులను నిలబెట్టింది. ఆ సంగీతానికి ఆహా అని అనుకుంటూనే అమ్మో.. టైమయిపోతోందంటూ మళ్లీ తమ బిజీ లైఫ్ లో పడిపోయారు. ఆ కొద్ది సేపు వారిని ఆగేలా చేసిన ఆ వృద్ధ ఉస్తాద్ ఎవరో కాదు. బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సోనూ నిగమ్. బీయింగ్ ఇండియన్ అనే సోషల్ ఎక్స్‌పెరిమెంట్లో భాగంగా సోనూ నిగమ్ ఒక వృద్ధ హార్మోనియం కళాకారుడి అవతారం ఎత్తాడు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై పాతబడిన హార్మోనియం పట్టుకుని పాటలు పాడాడు. అలా ఫుట్ పాత్ పై చాలాసేపు పాటలు పాడినా అతడిని ఒక్కరు కూడా గుర్తించలేదు. తాను ఉపయోగించిన హార్మోనియం తన చిన్ననాడు తన తల్లితండ్రులు బహూకరించిందని సోనూ చెప్పాడు. ఈ ప్రయోగం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నాడు.