యాపిల్ సీఈఓ టిమ్ కుక్ షారూఖ్ ఖాన్ తో కలిసి ఐపిఎల్ మ్యాచ్ వీక్షించనున్నారు. తన భారతదేశ పర్యటనలో భాగంగా టిమ్ కుక్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. పర్యటన ప్రారంభంలో ఆయన ఒక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆ తరువాత బుధవారం రాత్రి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇచ్చిన విందుకు హాజరైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం కాన్పూర్లో గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ చూడాలని నిర్ణయించారు. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కు షారూఖ్ ఖాన్ యజమాని అనే విషయం తెలిసిందే. విషయాన్ని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ధ్రువీకరించారు. కాగా, తన ఆహ్వానం మేరకే టిమ్ కుక్ ఐపిఎల్ మ్యాచ్ చూసేందుకు వస్తున్నారని చెప్పారు.
Mobile AppDownload and get updated news