Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85939

బీజేపీకిది భలే మంచిరోజు

$
0
0

గురువారం వెలువడి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పరాభవ భారాన్ని మరింత పెంచగా అధికార పార్టీ బీజేపీకి మాత్రం హర్షాతిరేకాలను పంచిపెట్టాయి. ఈ ఎన్నికల ద్వారా తొలిసారిగా బీజేపీ ఈశాన్య భారతంలో తొలి ప్రభుత్వాన్ని అస్సాంలో ఏర్పాటుచేయబోతోంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలోకి మళ్లీ అడుగుపెట్టబోతోంది. కేరళలో తొలి విజయాన్ని నమోదుచేసుకుంది. అంతేకాదు, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఇనుమడించిన ఉత్సాహం వచ్చింది. ఏ రకంగా చూసినా ఈ ఎన్నికలు ఫలితాలు బీజేపీకి సానుకూల వాతావరణముందనే చూపాయి. పెంచుకుంది. 2011 కన్నా ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు దక్కాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 670 సీట్లకు పోటీ చేయగా వాటిలో 65 సీట్లు బీజేపీ కైవసమయ్యాయి. అదే 2011 ఎన్నికల్లో అయితే ఆ పార్టీ 771 సీట్లకు పోటీచేయగా కేవలం 5 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85939

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>