కాలేజీ క్యాంపస్‌లో చెట్టుపై వున్న ఈ గబ్బిలాలు ఎండ వేడిమి తట్టుకోలేక ఇలా సొమ్మసిల్లి కిందపడి పడిపోయి కనిపించాయి. ఇంకొన్ని గబ్బిలాలు ఎండిపోయిన గొంతుతో తాగు నీటి కోసం నోరు తెరుచుకుని దీనంగా చూస్తున్నాయి.
గబ్బిలాల దీన స్థితి చూసి పరిస్థితి అర్థం చేసుకున్న స్థానికులు వాటికి నీళ్లు పోసి దాహర్తిని తీర్చే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. సాధారణంగా జనాలకి దూరంగా సంచరించే గబ్బిలాలు గురువారం నాడు మాత్రం బాటిళ్లతో వాళ్లు అందించే నీటిని తాగుతూ కనిపించాయి. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లోని ఓ కాలేజీ క్యాంపస్‌లో కనిపించిన దృశ్యాలివి.
చివరకు అగ్నిమాపక సిబ్బంది సైతం గబ్బిలాలకి నీళ్లు అందించి వాటి ప్రాణం నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా గబ్బిలాలు చనిపోయి ఇలా కిందపడిపోయాయి.
గురువారం గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండవేడి పెరిగింది.
Mobile AppDownload and get updated news