నీట్ పరీక్ష ఏడాది పాటు రద్దవడంతో తెలంగాణలో ఎంసెంట్ నిర్వహణపై క్లారీటీ వచ్చింది. నీట్ పై ఆర్డీనెన్స్ జారీ అయిన వెంటనే తెలంగాణలో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంసెట్ నిర్వహణ విషయంలో నీట్ పై కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూశామని.. ఇప్పుడు దీనిపై క్లారిటీ రావడంతో ఎంసెంట్ నిర్వహించాలని నిర్ణమం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే త్వరలో పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటిస్తామన్నారు. పరీక్షకు విద్యార్ధులు సన్నద్ధం కావాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు.
Mobile AppDownload and get updated news