నరేంద్ర మోడీ ఈ నెల 26వ తేదీతో ప్రధానిగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్రం నడుం బిగించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోనే ఈ రెండేళ్లు పూర్తి చేసుకున్న వేడుకలు జరిపేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది ఆ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఈ రెండేళ్లలో సాధించిన ప్రగతిని ప్రతిబింభించేలా ఓ గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత సౌండ్‌క్లౌడ్ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లోకి రీలీజ్ చేశారు. ''మేరా దేశ్ బదల్ రహా హై... ఆగే బఢ్ రహా హై'' అంటూ సాగే ఈ గీతానికి సంబంధించిన సౌండ్‌క్లౌడ్ లింకుని మోడీ శుక్రవారం సాయంత్రం తన ట్విటర్ ఖాతాలోనూ షేర్ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ఆడియోకు సంబంధించిన వీడియో కూడా విడుదల కానుంది. ఆడపిల్లల చదువులు, రైతుల సంక్షేమం, పేదరికం నిర్మూలన, యువత, గ్రామీణ వ్యవస్థ, బ్యాంకు ఖాతాలు తెరవడం, సుఖవంతమైన రైల్వే ప్రయాణం వంటి పలు ఇతర అంశాలతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో సామాన్యుడు ఎలా లబ్ధి పొందుతున్నాడనే కోణాన్ని స్పృశిస్తూ ఈ గీతం కొనసాగింది. ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌లో ట్రెండ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ గీతంపై మీరు ఓ లుక్కేయండి.
Mobile AppDownload and get updated news