సైన్యం అంటే క్రమశిక్షణకు మారుపేరు. దేశ సరిహద్దులను కంటికిరెప్పలా కాపాడుకునే విషయంలో ఒక్క సైనికుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ దేశం పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే సైన్యంలో క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తారు. అప్పుడప్పుడే సైన్యంలోకి అడుగుపెట్టిన యువకులు తెలిసో తెలియకో అత్యుత్సాహంతోనో ఏమైనా పొరపాట్లు చేసినా దానికి శిక్షలు బాగానే ఉంటాయంటారు. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలుంటాయని అని ప్రచారం ఉన్నా వాస్తవమేంటో బయటి తెలియదు. సైన్యంలో ఏమి జరిగినా అంత సీక్రెట్ మరి. ఈ నేపథ్యంలో నెటిజన్ ఒకరు కోరా. కామ్ లో ఒక ప్రశ్న అడిగాడు. పొరపాట్లు లేదా తప్పులు చేసే సైనికులకు వివిధ దేశాల్లో ఎలాంటి శిక్షలుంటాయని ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రష్యాకు చెందిన మరో నెటిజన్ తమ దేశ సైన్యానికి చెందిన కొన్ని ఫోటోలను సమాధానంగా పోస్ట్ చేసాడు. అవే ఇక్కడ ఇస్తున్నాం. (ఈ ఫోటోలు కోరా డాట్.కామ్ లోనుండి తీసుకున్నాం)
విధుల్లో ఉండగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే చెక్కతో చేసిన పెద్ద ఫోనును రోజంతా సదరు సైనికుని మెడకు వేలాడదీస్తారు. రోజంతా అతని మెడలో అది ఉండాల్సిందే. ఇక వివిధ రకాల తప్పులకు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలిలా ఉంటాయి.
సిగరెట్ తాగిన సైనికుడికి ఇలాంటి పెద్ద చెక్క సిగరెట్ ఇచ్చి రోజంతా మోయిస్తారు
బాయ్ నెట్ లేకుండా డ్యూటికి హాజరైతే ఈ చెక్క బాయినెట్ ఇచ్చి రోజంతా మోయిస్తారు
ఆయుధాన్ని మరిచిపోయి వచ్చిన సైనికుడు ఈ చెక్క ఆయుధాన్ని మోయాల్సిందే
ఈ చెక్క ఆయుధాలన్నీ ఒక్కొక్కటి అమితమైన బరువును కలిగి ఉండే దుంగలతో చేస్తారు.
Mobile AppDownload and get updated news