Mobile AppDownload and get updated news
అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఒక మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఓహియో రాష్ట్రంలోని రహదారులపై తన కారులో ప్రయాణిస్తోంది. కానీ ఆ కారు పరుగు మిగిలిన కార్లమాదిరిగా లేదు. విధుల్లో ఉన్న ప్యాట్రోల్ సిబ్బంది దూరం నుండి ఆమె కారు పరుగులు తీస్తున్న వైనం అనుమానం కలిగించింది. మిగిలిన కార్లకు బిన్నంగా అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న ఆ కారు ఆకస్మికంగా వేగం పుంజుకుంది. దాంతో పోలీసులు ఆ కారును వెంబడించారు. చేజ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ మహిళ తన కారు వేగాన్ని మరింత పెంచింది. చివరకు అదుపుతప్పి క్రాష్ అయింది. పోలీసులు కారు కూడా ఆమెను ఢీకొనకుండా తృటిలో తమాయించుకుంది. పోలీసుల విచారణలో ఆ మహిళ పీకల్లోతు మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆమెతో పాటు ఆమె ఐదేళ్ల బిడ్డ కూడా ఆ కారులో అమాయకంగా పోలీసులను చూస్తూ కూర్చున్న దృశ్యం వారికి కనిపించింది. ఆ ప్రమాదంలో అదృష్టవశాత్తు తల్లీ, బిడ్డకు ఏమీ కాలేదు. అమాయకపు పసిగుడ్డును పక్కనుంచుకుని నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసారు.