రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా వస్తే అది వస్తుంది.. ఇది వస్తుందని జనాలను ప్రతిపక్షాలు మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలోని అన్ని సమస్యలు తీరిపోవని.. అదే నిజమైతే హోదా ఉన్న రాష్ట్రాలన్నీ ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చెందలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఓ విజన్ తో ముందుకు వెళ్లాలని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రయోజనం చేకూర్చే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సి ఉందని.. ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీని అన్ని రాష్ట్రాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Mobile AppDownload and get updated news