Mobile AppDownload and get updated news
యాపిల్ సీఈవో టిమ్ కుక్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మనదేశంలో పర్యటించనున్నారు. సత్య ఈ నెల 30వ తేదీన మన దేశానికి రానున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రస్తుతం టిమ్ కుక్ మండుటెండలను సైతం లెక్కచేయకుండా దేశంలోని వివిధ నగరాలను మెరుపులా చుట్టివస్తున్నారు. ఒకవైపు అధికారిక, మరోవైపు వ్యక్తిగత కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరువాత మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో కూడా భారత పర్యటనకు రావడం విశేష ప్రాథాన్యతను సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్ పగ్గాలను చేపట్టిన ఏడునెలల్లోనే సత్య నాదెళ్ల ఇప్పటికి మూడుసార్లు తన స్వదేశాన్ని సందర్శించారు. మే 30వ తేదీన జరిగే పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలో యువ పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, డెవలపర్లు, విద్యార్థులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా ఆయన భారతదేశపు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల ఎగ్జిక్యూటివ్ లతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఏర్పాటుచేస్తోంది.