జాతి విధ్వేషంతో పొరుగు దేశాల వారిపై నేరారోపణ చేస్తూ అక్రమంగా అదుపులోకి తీసుకోవడం తగదని అభిప్రాయపడ్డారు సరబ్‌జిత్ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా. అది పాకిస్థాన్‌లోనైనా లేక భారత్‌లోనైనా... ఎక్కడైనా సరే అక్రమ అరెస్టులు తప్పేనని రణ్‌దీప్ హుడా అన్నారు. నిన్న శుక్రవారం రిలీజైన సరబ్‌జిత్ సినిమా సరబ్‌జిత్ సింగ్ తరహా బాధితులు గళమెత్తేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సరబ్‌జిత్ భారతీయుడు అయినందువల్లే అతడు పాకిస్థాన్‌లో నరకం అనుభవించాడు. సినిమా కూడా ఈ అంశాన్నే వెలుగులోకి తీసుకువస్తుందని రణ్‌దీప్ స్పష్టంచేశాడు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సరబ్‌జిత్ భార్య పాత్రలో రిచా చద్దా, సోదరి పాత్ర దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నటించారు.
Mobile AppDownload and get updated news