సీబీఎస్ఈ ప్లస్2 పరీక్షల్లో రక్షిత్ మాలిక్ అనే అంధ విద్యార్థి అత్యంత ప్రతిభ కనబరిచి అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఢిల్లీకి చెందిన రక్షిత్ మాలిక్ కు 90 శాతం వరకు అంధత్వం ఉంది. అంధత్వం అడ్డంకిగా మారినప్పటికీ రక్షిత్ మాలిక్ లోని ఆత్మవిశ్వాసం దాన్ని ఇట్టే అధిగమించింది. ప్లస్ టూ పరీక్షల ఫలితాల్లో అతనికి ఏకంగా 97.4శాతం మార్కులు రావడం చూసి అంతా ఆశ్చర్యచకితలయ్యారు. తొలి నుండీ చదువుల్లో ముందంజలో ఉన్న మాలిక్ సాధించిన మార్కులు అతని తరగతిలో అందరికంటే ఎక్కువ. చిన్ననాటి నుండి తనకు అంధత్వం ఉందని, వయసుతో పాటే అది తన అంధత్వ సమస్యలు పెరిగాయని మాలిక్ చెప్పాడు. కానీ, బాగా చదివి పైకి రావాలనే తన లక్ష్యమే తనను అందరికంటే ముందుండేలా చేసిందని చెప్పాడు. తనను అడుగడుగునా ప్రోత్సహించిన తల్లితండ్రులు, సోదరుడికి మాలిక్ థ్యాంక్స్ చెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం మాలిక్ ఎటువంటి కోచింగ్ క్లాసులకు హాజరుకాలేదు. తనంతట తానే సొంతంగా టీచర్ల సాయంతో పరీక్షలకు సిద్దమయ్యాడు.
![]()
Mobile AppDownload and get updated news