కబాలి సినిమాకు సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డుల మోత మోగుతూనే వుంది. ఇప్పటికే ఇండియాలో అత్యధిక వ్యూస్ పొందిన ఇండియన్ సినిమా టీజర్‌గా కబాలి టీజర్ రికార్డుకెక్కగా తాజాగా ఈ సినిమా మలేషియాలో మలే భాషలోనూ డబ్ అవుతోంది. ఇండియాలో తమిళ, తెలుగు భాషలతోపాటు మలేషియాలో మలే భాషలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుందీ సినిమా. మలేషియాలో అక్కడి భాషలోకి డబ్ అవుతున్న మొట్టమొదటి తమిళ సినిమాగా కబాలి మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. మలేషియాకు చెందిన మలిక్ స్ట్రీమ్స్ ప్రొడక్షన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే కంపెనీ కబాలి సినిమాని మలే వెర్షన్‌లో అక్కడి ఆడియెన్స్‌కి అందిస్తోంది. ఈమేరకు ఆ కంపెనీ తన సొంత ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో మలే భాష టీజర్‌ని సైతం అప్‌లోడ్ చేసింది. ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Mobile AppDownload and get updated news