హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ఉద్యోగులకు పనివేళలు ఖరారు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీవో ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉద్యోగులు పని చేయాల్సి ఉంది. శని, ఆదివారాలు సెలవు తీసుకోవచ్చు. బదిలీ అంశంపై ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏడాది పాటు మాత్రమే ఈ నిబంధన అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వెలగపూడిలో నిర్మించిన కొత్త సచివాలయంతో పాటు అమరావతి పరిసర ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది.
Mobile AppDownload and get updated news