అసోం సీఎంగా శర్వానంద్ సోనోవాల్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది కేబినెట్ మంత్రుల చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇదిలా ఉండగా సోనోవాల్ ప్రమాణస్వీకారంతో అసోంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో 86 స్థానాలు సాధించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో రథసారధి ప్రాత పోషించిన సోనోవాల్ కు సీఎం అభ్యర్ధిగా ఎంపిక చేసిన అధిష్టానం..ఆయన చేత ఈ రోజు ప్రమాణస్వీకారం చేయించింది.
Mobile AppDownload and get updated news