ఏపీలోని గురుకుల విద్యాసంస్థల ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. గురుకులాలకు చెందిన స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకుఎంపికైన విద్యార్ధుల జాబితాను మంత్రి గంటా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గురుకులాల్లో విద్యా ప్రమాణాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.
Mobile AppDownload and get updated news