హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. విద్యలో నాణ్యత పెంపొందించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బోగస్ విద్యా సంస్థలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోను తాము విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నామని.. దీనికి సహకరించాలని ప్రవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు సీఎం కేసీఆర్ కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడానికి గల కారణం విద్య లో నాణ్యత లోపించడం ఒకటైతే... మరో కారణం ఉపాధిలేని కోర్సులని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.విద్యా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ గా హబ్ తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం కేసీఆర్ అన్నారు.
Mobile AppDownload and get updated news