బాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం త్వరలో విడుదలకాబోతోంది. చిత్రం మూవీ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటిగా సుల్తాన్ మొదటి స్థానంలో ఉంది. కండలవీరుడు సల్లూభాయ్ ఈ చిత్రంలో కుస్తీయోధునిగా కనిపించనున్నాడు. అతనికి జోడీగా అనుష్కాశర్మ నటిస్తోంది. కాగా, మంగళవారం విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగినట్లే ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. ట్రైలర్లోని సీన్లను బట్టి ఆ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందంటున్నారు.
Mobile AppDownload and get updated news