తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ప్రకటించిన వంద రోజుల ప్రణాళికలో ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చుతూ ఇందుకు సంబంధించిన జీవోను మంగళవారం నాడు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల పరిథిలో జీవించే పేదవర్గాలకు ఒక రూపాయి కట్టించుకుని సురక్షిత తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తారు. తెలుపు రేషను కార్డు కలిగి ఉన్న రూ.2 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ సదుపాయం ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ సదుపాయం వల్ల ఐదులక్షల కుటుంబాల వరకు లబ్ధిపొందుతాయని అంటున్నారు.
Mobile AppDownload and get updated news