బ్రహ్మోత్సవం సినిమాకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ తన పాత్రకి మాత్రం ప్రసంశలే దక్కాయంటోంది కాజల్ అగర్వాల్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం మూవీ నుంచి మొదలుకుని అప్‌కమింగ్ రిలీజ్ దో లఫ్జోకి కహాని సినిమాలో కిస్ సీన్ వివాదం, లవ్ లైఫ్, పెళ్లి వరకు వివిధ అంశాలపై కాజల్ క్లారిటీ ఇచ్చింది. సినిమాల రిజల్ట్స్ ఎలా వున్నా తన కెరీర్‌లో ప్రతీ సినిమా నుంచి వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఎంతో నేర్చుకుంటున్నాను అంటున్న కాజల్ ఇప్పుడప్పుడే పెళ్లి మాత్రం చేసుకోనంటోంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు, నేను ఎవరో ఓ వ్యక్తితో ప్రేమలో పడేవరకు పెళ్లి చేసుకోను. కాకపోతే అతను సినీపరిశ్రమకి చెందిన వాడు అయ్యుండకూడదు. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్‌ని పెళ్లి చేసుకోకూడదు. అలా ఒకే రంగానికి చెందిన వాళ్లెప్పుడూ ఒకరినొకరు పెళ్లి చేసుకోకూడదు. అప్పుడే ఒకరి నుంచి ఇంకొకరు ఏమైనా నేర్చుకునే అవకాశం వుంటుంది. ఇక నాకు కాబోయే వ్యక్తి మంచి డీసెంట్ లుక్స్, ఓపెన్ మైండెడ్, అర్థం చేసుకునే స్వభావం కలిగి వుండాలి. అన్నింటికిమించి అతడు మంచి ఎత్తుండాలి. నేను మొదట కోరుకునే లక్షణాల్లో అతడి ఎత్తే ప్రధానమైనది అంటూ తనకి కాబోయే ఆయన ఎలా వుండాలా అనే ఫీచర్స్ ని వెల్లడించింది కాజల్.
![]()
దో లఫ్జోకి కహానీ మూవీలో కిస్ సీన్ వివాదం విషయంపై స్పందించిన కాజల్... అది అసలు వివాదమే కాదని బదులిచ్చింది. "ఎవ్వరు, ఎక్కడ, ఎందుకు దానిని వివాదం చేశారో తెలీదు కానీ అందులో అసలు అర్థమే లేదు. నాకు తెలియకుండానే ఆ సినిమా నటుడు నన్ను కిస్ చేశాడు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను అంగీకరించాకే ఆ సీన్ జరిగింది. మొదట్లో నేను కూడా ఆ సన్నివేశం చేయడానికి కొంచెం తటపటాయించాను. కానీ ఆ సన్నివేశం గురించి దర్శకుడు వివరించాకా అందులో తప్పు లేదనిపించి అంగీకరించాను" అని చెబుతున్న కాజల్... ఇటువంటి సన్నివేశమే బ్లాక్ సినిమాలో సీనియర్ యాక్టర్ అమితాబ్, యంగ్ లేడీ రాణీ ముఖర్జీ చేయగా లేని సందేహాలు దీనికెందుకు అని కిస్ సీన్‌ని సమర్థించుకుంది.
Mobile AppDownload and get updated news