చైనాలోని వరదల్లో చిక్కుకున్న ఒక భవనం అందరి కళ్లముందే కుప్పకూలి నదిలో కొట్టుకుపోయింది. దక్షిణ జువాన్గ్జీ జువాంగ్ అనే స్వయంప్రతిపత్తి హోదా గల ప్రోవిన్సులో మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. గత రెండు శతాబ్దాల్లో ఎన్నడూ లేనిరీతిలో వర్షాలు కురవడంతో అక్కడి గృహాలు నీటికి బాగా తడిసి నానిపోయాయి. ఆ ప్రాంతంలోని ఒక మూడు అంతస్తుల భవనం కూడా నీటికి బాగా నాని బీటలు వారడంతో అందులోని గృహస్తులను బయటకు పంపి ఖాళీ చేయించారు. వారందరూ బయటకు వచ్చిన కాసేపటికే ఆ భవనం కుప్పకూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం గురించి వార్తలు రాలేదు. వీడియో చూడండి.
Mobile AppDownload and get updated news