దేశంలో సంభవిస్తున్న పొగాకు సంబందిత కేన్సర్ మరణాల్లో మేఘాలయ మొదటి స్థానంలో ఉంది. మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో దేశంలో అత్యధికంగా పొగాకు సంబంధిత ఉత్పత్తుల వాడకం వల్ల సంభవించే మరణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ జిల్లాలో ప్రతీ ఏటా పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు పొగాకు సేవనం ఫలితంగా సంభవించే కేన్సర్ల బారిన పడి చనిపోతున్నట్లు నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సిఆర్పీ) నివేదిక తేటతెల్లం చేసింది. ఈ జిల్లాలోని మరణాల్లో 69.5 శాతం పురుషుల మరణాలు, 45శాతం స్త్రీల మరణాలు పొగాకు సంబంధిత కేన్సర్లవేనని నివేదికలో వెల్లడయింది.
Mobile AppDownload and get updated news