భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు మోడీ వెయ్యి కోట్లు తక్షణ సాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అయిదువేల కోట్ల రూపాయలను ఇవ్వాలని కోరారు. చెన్నై వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. గురువారం మోడీ వరద ప్రాంతాలను హెలికాఫ్టర్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం జయలలిత ప్రధానిని కలిశారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని మోడీకి వివరించారు. జాతీయ విపత్తు స్పందన నిధి నుంచి రూ.5 వేల కోట్ల రూపాయలను కేటాయించాని కోరారు. ఆమె అడిగిన వెంటనే రూ.1000 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా ప్రకటించారు. అలాగే జయలలిత కోరిక మేరకు సహాయక పనుల్లో పాల్గొనేందుకు అదనంగా 10 ఆర్మీ బలగాలు, 20 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను కేటాయించారు.
Mobile AppDownload and get updated news