సౌతాఫ్రికా భారత్ ల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెహానే సెంచరీతో కదంతొక్కాడు. దీంతో భారత్ స్కోర్ : 257/7 కు చేరింది. 231 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఉదయం కోహ్లీసేన బ్యాంటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. టీమిండియా చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మూడు వందల పైచిలుగు స్కోర్ చేయాలనే లక్ష్యంగా టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. అశ్విన్ 21 పరుగులతో రెహానేకు చక్కటి సహకారం అందిస్తుండటంతో 300 స్కోర్ పెద్ద కష్టకాకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 300పై స్కోర్ చేసి సఫారీలను ఒత్తడిలో నెట్టేలానే వ్యూహంతో భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
Mobile AppDownload and get updated news