నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త ఊరట కల్గించే విషయమైనప్పటకీ ..అక్కడ పరిస్థితులు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. చాలా గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. రిజయర్వాయర్ల వద్ద వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. వరద బాధితులు ఇంకా పునరావస కేంద్రాల్లోనే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. నిత్యావసరాలు అందక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళ అందిన రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు విద్యుత్ సరఫరా లేక చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోని ఉన్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కార్ మరింత అప్రమత్తమైంది. ఒకవైపు సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు ముందస్తు చర్యలు చేపడుతోంది.
Mobile AppDownload and get updated news