తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ హతమయ్యాడు. అతన్ని ఏ సైనిక దళాలో మట్టుబెట్టలేదు... అంతర్గతంగా ఉన్న వర్గా భేదాలే మరణానికి కారణమయ్యయి. పూర్తి వివరాల ప్రకారం... తాలిబన్ అగ్రనేత్తల్లో ముల్లా అక్తర్ మన్సూర్ కూడా ఒకరు. 2001లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్నప్పుడు ఇతను విమానయాన మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు మద్దతు తెలిపిన వారిలో ఆయన కూడా ఒకరు. ఈ ఏడాది జులైలో తాలిబన్ చీఫ్ ముల్లా ఒమర్ మరణించాక ముల్లా అక్తర్ చీఫ్ అయ్యాడు. తాలిబన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ల మధ్య వివాదాలు తలెత్తిన నేపథ్యంలో వారు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇరు వర్గాల మధ్య గురువారం వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఆ ఘర్షణలో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ముల్లా అక్తర్ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం మరణించినట్టు అఫ్గనిస్తాన్ సైనిక అధికారులు ప్రకటించారు.
Mobile AppDownload and get updated news