యూరోకప్-2016 ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు బోణీ కొట్టింది. రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. గతంలో రొమేనియాపై మెరుగైన విజయాల రికార్డు ఉన్న ఫ్రాన్స్ ఈ మ్యాచ్‌లోనూ పై చేయి సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన గంటకు ఫ్రాన్స్ ఆటగాడు ఆలివ్ గిరౌడ్ గోల్ సాధించాడు. కాసేపటికే రొమేనియా కూడా గోల్ చేసింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. 88వ నిమిషంలో దిమిత్రి పాయెట్ అద్భుతమైన గోల్ సాధించడంతో ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు ప్రత్యర్థి జట్టు దాడిని కాచుకోవడంలో సఫలమవడంతో ఫ్రెంచ్ జట్టు విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్ గెలుపొందడం ద్వారా 2000 సంవత్సరం తర్వాత యూరోకప్ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి ఆతిథ్య జట్టుగా ఫ్రాన్స్ రికార్డు సొంతం చేసుకుంది. 2000లో ఆతిథ్య బెల్జియం జట్టు స్వీడన్‌పై గెలుపొందింది.
Mobile AppDownload and get updated news