రానా... చేజేతులా ఓ సూపర్ హిట్ సినిమాని వదిలేసుకున్నాడట. ఇప్పుడు దాని సక్సెస్ చూసి తెగ బాధపడుతున్నట్టు సమాచారం. ఆ సినిమా బిచ్చగాడు. సైలెంట్ హిట్ కొట్టిన సినిమా అది. మొదట తమిళంలో దానిని తీశారు. కాగా ఆ సినిమా రీమేక్ లో నటించమంటూ రానాకు ఆఫర్ వచ్చింది. సినిమా చూశాక... బాగుంది కానీ తెలుగు ప్రజలకు అంతగా నచ్చకపోవచ్చు అని తిరస్కరించాడట. అయితే నిర్మాతలు దానిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగు హక్కులు రూ.50లక్షలకి కొనుక్కున్న నిర్మాతలకు రూ.10కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది బిచ్చగాడు సినిమా. ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ హీరోగా చేశాడు. బిచ్చగాడు సినిమా బాగుండడంతో అతనికి తెలుగు నుంచి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. కోరి వచ్చిన మంచి సినిమాని కాదన్నానే అని రానా ఇప్పుడు విచారిస్తున్నట్టు టాక్.
Mobile AppDownload and get updated news