ఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు దేవినేని, హరీష్ రావు గురువారం మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ మంత్రి దేవినేని మాట్లాడుతూ ట్రిబ్యూనల్ తీర్పుకు వ్యతిరేకంగా టి.సర్కార్ తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు... దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తమ పరిధిలో ఉన్న నదీ జాలలను మాత్రమే తాము వాడుకుంటున్నారు. నీటిని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. నిన్న సాయంత్రం జరిగిన భేటీలో ఇదే అంశంపై తెలుగు మంత్రులు తమ తమ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ భేటీలో ఎలాంటి పురోగతి కనిపంచకపోవడంతో ఇరువురు మంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలోనైనా సయోధ్య కుదురుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.
నదీజలాల పంపిణీ విషయంలో కృష్ణా వాటర్ బోర్డు జోక్యం చేసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఈ అంశంపై స్పందించిన కృష్ణా వాటర్ బోర్డు ఇరు రాష్ట్రాల మంత్రులు కూర్చోని ఏకాభిప్రాయానికి రావాలని ..అందుకు నెల రోజుల వ్యవధి ఇస్తున్నామని పేర్కొంటూ .. ఈ వ్యవధిలోపు పరిష్కారం దొరకని పక్షంలో తామే జోక్యం చేసుకొని నదీ జలాలు పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు చెప్పిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డువ్యాఖ్యల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర జలవనరులశాఖ ఏపీ,తెలంగాణ నీటిపారదలశాఖ మంత్రుల మధ్య భేటీలు నిర్వహిస్తోంది.
Mobile AppDownload and get updated news