మహారాష్ట్రాలో బీజేపీ-శివసేన కలహాల కాపురం ఇంకా కష్టాల్లో కూరుకుంటోంది. అవకాశం వచ్చినప్పుడల్లా రెండు పార్టీల వారు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. జూన్ 19న శివసేన ఏర్పాటు చేసి 50ఏళ్ల గడిచిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బిజేపీపై కామెంట్లు చేశారు. బీజేపీ నిజాములకే బాబులాంటిదన్నారు. ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన-బీజేపీ పొత్తుండాలంటే గౌరవప్రదమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని అన్నారు. ఈ కామెంట్లకు బీజేపీ నేత మాధవ్ బంఢారీ నోటితో కాకుండా కలంతో సమాధానం ఇచ్చారు. మనోగత్ అనే మ్యాగజైన్ కు ఆయన వ్యాసం రాశారు. అందులో ఉద్దవ్‌ను షోలే సినిమాలో జైలర్ పాత్రతో పోల్చారు. జైలర్ తన వెనుక ఎవరైనా ఉన్నారో లేరో చూసుకోకుండా... గార్డులనుద్దేశించి సగం మంది అటు వెళ్లండి, సగం మంది అటు వెళ్లండి, మిగతా వారు నా వెనుక రండి అని అంటాడని, కానీ తన వెనుక ఎవరూ లేరన్న సంగతి గుర్తంచుకోడని ఎద్దేవా చేశారు. అలాగే బీజేపీ పాలన నిరంకుశంగా అనిపిస్తే... కలిసి ఉండడమెందుకని 'తలాక్' చెప్పేయచ్చుగా అని అన్నారు. బీజేపీతో విడిపోతే శివసేనలో ఒక్కరూ మిగలరేమో నని ఉద్ధవ్ భయపడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీతో కలిసి రుచికరమైన బిర్యానీ తింటూ... తిరిగి శివసేన బీజేపీనే విమర్శిస్తోందన్నారు. పొత్తును కాపాడుకునేందుకు బీజేపీ 20 అడుగులు వెనక్కి వేయడానికైనా సిద్ధపడుతుందని అన్నారు.
Read this story in marathi
http://maharashtratimes.indiatimes.com/maharashtra/mumbai-news/bjp-maharashtra-spokesperson-slams-uddhav-thackeray/articleshow/52879569.cms
Mobile AppDownload and get updated news