భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైపోతోంది. బ్రెగ్జిట్ ప్రభావం మన మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే అవకాశం ఎక్కువ ఉందన్న వార్తలు ఎక్కువగా రావడంతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. డాలర్ తో పాటూ రూపాయి విలువ భారీగా పడిపోయింది. జపాన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉదయం ఓపెన్ సెషన్ కు ముందు బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది.
Mobile AppDownload and get updated news