గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ 'కోరా' అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన అవర్‌మైన్ గ్రూపే ఈ ఘటనకు పాల్పడింది. ప్రశ్నలకు జవాబులు ఇచ్చే కోరా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్లో పిచ్చాయ్ అకౌంట్లో కొన్ని సందేశాలను ముగ్గురు సభ్యుల అవర్‌మైన్ గ్రూప్ ఉంచింది. పిచ్చాయ్ తన కోరా అకౌంట్‌ను ట్విట్టర్‌కు అనుసంధానం చేయడంతో ఆయన్ను ఫాలో అయ్యే 5 లక్షల మందికి ఈ విషయం తెలిసింది. సెలబ్రెటీల అకౌంట్లు ఏ మాత్రం సురక్షితమో తెలుసుకోవడానికి మాత్రమే ఈ పని చేస్తున్నామని నెక్స్ట్ వెబ్ అనే వెబ్‌సైట్‌కు హ్యాకర్లు తెలిపారు. ఫేస్ బుక్ సీఈవో అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ వాడుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని హాకర్లు వెల్లడించారు. గతంలోనూ లింక్డ్ ఇన్‌లో ఉంచిన లక్షలాది మంది ప్రొపైళ్లు, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించిన సంగతి తెలిసిందే.
Mobile AppDownload and get updated news