ఢిల్లీ: తెలంగాణలో నిర్మించతలపెట్టిన షార్మా సిటీ కోసం రూ.200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫార్మా సిటీ అభివృద్ధి కోసం కేంద్రానికి రూ.1500 కోట్ల నిధులు అడిగామని.. అయితే కేంద్రం తొలి విడతలో రూ.200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని తెలంగాణను షార్మా హాబ్ గా తీర్చిదిద్దుతామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు సింగిల్ ప్రొడక్ట్ సెజ్ లు మాత్రమే ఉన్నాయని.. బహుళ సెజ్ లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రిని కోరామని. ..అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Mobile AppDownload and get updated news