ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రాజన్ ను తొలగిస్తారనే ప్రచారం ఉపందుకున్ననేపథ్యంలో ఏకంగా ప్రధాని మోడీయే ఆయనకు బాసటగా నిలిచారు. టైమ్స్ నౌ ఇంటర్యూలో మీ పార్టీకి చెందిన ఎంపీ.. రాజన్ పై చేస్తున్న ఆరోపణలపై మీ స్పందన ఏంటని ప్రశ్నించిన సందర్భంలో ప్రధాని మోడీ రాజన్ కు మద్దుత తెలిపేలా స్పందించారు. విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ గవర్నర్ రాజన్ పై తమ పార్టీకి చెందిన ఎంపీ ఆరోపణలు సరికావని చెబుతూ.. పరోక్షంగా సుబ్రమణ్యస్వామిని వ్యాఖ్యలను ఖండించారు. కొందరు నేతలు పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతూంటారని.. ఇలాంటి వ్యాఖ్యలు సరికావన్నారు. రాజన్ మానసికంగా భారతీయుడు కాదన్న వ్యాఖ్యలపై మోడీ స్పందిస్తూ రాజన్ గొప్ప దేశభక్తుడని ప్రశంసించారు. రాజన్ దేశ భక్తిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని.. అతను ఎక్కడున్నా భారత్ ప్రయోజనాల కోసం పనిచేస్తారని ప్రధాని మొడీ కొనియాడారు.
కేంద్ర ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఆర్ధిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పై కూడా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రమణ్యస్వామి తీరును కేంద్రంలోని మరో సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పరోక్షంగా ఖండించారు. అలాగే స్వామీ వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ..స్వామి వ్యాఖ్యలను తప్పుబడ్డటం విశేషం. ఆర్బీఐ గవర్నర్ రాజన్ పై సుబ్రమణ్య స్వామీ చేసిన వ్యాఖలు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యస్వామికి షోకాజ్ నోటీసు ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.
Mobile AppDownload and get updated news