రజినీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ ఆఫర్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌కు 'ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్' అని పేరు పెట్టింది. బెంగళూరు నుంచి కోచి వెళ్లేందుకు అన్ని పన్నులతో కలిపి రూ.786లుగా ధర నిర్ణయించింది. అలాగే బెంగళూరు నుంచి గోవాకు రూ.786, విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 1,786 రూపాయలుగా నిర్ణయించింది. ఇక అంతర్జాతీయ మార్గాల్లో ప్రారంభ ధరను రూ.2,999గా నిర్ణయించింది. భారత్ నుంచి థాయిలాండ్ లోని క్రాబీకి, ఆక్లాండ్, మారిషస్ కు, చైనాలోని గ్వాంగ్ జూకు, ఇండోనేషియా లోని లంబోక్ కు, వియత్నాంకు ఈ ధరను నిర్ణయించింది. పై ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 - ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి కేటాయించారు. టిక్కెట్ బుకింగ్ కు జూలై 3 వరకు సమయం ఉంది.
Mobile AppDownload and get updated news