Mobile AppDownload and get updated news
ఓ అమ్మాయి వెంట పడ్డాడు ఆకతాయి. అమ్మాయి ప్రేమించకపోయేసరికి... తాగి బండి నడిపి అమ్మాయిని ఢీ కొట్టాడు. వెన్నెముక దెబ్బతిని... ఆరునెలల పాటూ మంచానికే పరిమితమయ్యే పరిస్థితిలోకి వెళ్లింది అమ్మాయి. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. చంద్రిక అనే అమ్మాయి ఇంటర్ చదువుతున్న సమయంలో అదే క్లాసులో ఉన్న నవీన్ అనే యువకుడు ప్రేమించాడు. అతని ప్రేమను చంద్రిక ఒప్పుకోలేదు. నవీన్ ఇంటర్ ఫెయిలయ్యాడు. అమ్మాయి తన చదువును కొనసాగిస్తోంది. కాగా నవీన్ తరచూ చంద్రిక వెంట పడేవాడు. ఆమె ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి యశ్వంత్ అనే మరో స్నేహితునితో కలిసి ఈ నెల1న మద్యం తాగాడు. చంద్రిక తన స్నేహితురాలి బండి మీద వెళుతుండగా... అతి వేగంగా వచ్చి తన బండితో ఆమె బైక్ ను ఢీకొట్టాడు. కిందపడిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్లి చంపేస్తానంటూ బెదిరించి మరీ వెళ్లాడు. గాయపడిన చంద్రికను ఆసుపత్రిలో చేర్చించారు తల్లిదండ్రులు. వెన్నెముక దెబ్బతిన్నట్టు వైద్యుతు గుర్తించి... ఆరునెలల పాటూ మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నవీన్ పై మొదట్లో కేవలం యాక్సిడెంట్ కేసే నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు నిర్భయ కేసు కూడా నమోదు చేశారు.