అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా ఆరలేదు. ఇంతెత్తున నాలుకలు చాపిన అగ్ని దాటికి కిలోమీటర్ల కొద్ది అరణ్యం బుగ్గిగా మారిపోతోంది. అరణ్య ప్రాంతాలకు సమీపంలోని గృహాలు కూడా పెద్ద సంఖ్యలో ఆహుతైపోయాయి. ఇప్పటి వరకు 200కు పైగా గృహాలు కార్చిచ్చుదాటికి సర్వనాశనమైపోయాయని అధికారులు తెలిపారు. దక్షిణ నేవడా ప్రాంతంలో కార్చిచ్చు ప్రభావం అమితంగా ఉంది. కార్చిచ్చు బారిన పడిన ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమైపోయారు. అగ్నిమాపకదళ సిబ్బంది హెలీకాప్టర్ల సాయంతో రాత్రింబగళ్లు మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో పౌరులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Mobile AppDownload and get updated news