న్యాయవాదుల సమస్యపై సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిందించిన నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన సమస్యను కేంద్రానికి ముడిపెడుతూ తమను నిందించడం సరికాదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఇప్పటికైనా మాపై నిందులు వేయడం మాని మీ బాధ్యతను మీరు నెరవేర్చాలని సీఎం కేసీఆర్ కు దత్తాత్రేయ హితవు పలికారు. ఈ విషయంలో అవసరమనుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో హైకోర్టు విభజన, జడ్జీల కేటాయింపు తరతర అంశాలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సందానందగౌడ్ లతో సమావేశమైన తర్వాత కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఈ విధంగా స్సందించారు.
Mobile AppDownload and get updated news