Mobile AppDownload and get updated news
హైకోర్టు విభజన అంశంపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఒకింత అసహనం వ్యక్తం చేసారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఏమాత్రం బాలేదని వ్యాఖ్యానించారు. కేంద్రానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ కేసీఆర్ తీరు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గుర్తుకు తెస్తున్నదన్నారు. కేసీఆర్ మరో కేజ్రీవాల్ గా మారరాదన్నారు. ధర్నాల వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పించి మరేమీ ఒనగూరదన్నారు. కోర్టు విభజన అంశం హైకోర్టు పరిథిలోనిది అని, దీనిపై కేంద్రం చేయగలిగిందేమీ లేదని స్పష్టం చేసారు. ఏపీలో హైకోర్టు స్థాపనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించాల్సి ఉందన్నారు. హైదరాబాదులో జరుగుతున్న ఆందోళనలను గురించి సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానన్నారు. హైకోర్ట్ విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్ అంశాలపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం సదానందగౌడతో సమావేశమైన సందర్భంగా ఆయనీ మాటలు చెప్పారు.