Mobile AppDownload and get updated news
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఓ సస్పెన్స్ వీడింది. ఒక దాని తర్వాత ఒకటి ఈ సినిమా షెడ్యూల్స్ పూర్తవుతున్నా.. ఇంతకాలం ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరు, సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాను కన్ఫర్మ్ చేయడంతో ఇక హిరోయిన్ ఎవరు అనేది ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది. లేటెస్ట్ సమాచారం మేరకు మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్‌ను ఫిక్స్ చేశారు. ఇదివరకే కాజల్ పేరు వినిపించినప్పటికీ ఈ విషయంలో ఒకసారి అవునని, ఇంకోసారి కాదు అని క్లారిటీ మిస్సయింది. ఎట్టకేలకు కాజల్‌ను ఫైనల్ చేస్తూ చిత్ర నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. కాజల్.. రామ్‌చరణ్ సరసన మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో ఆడిపాడింది. అలాగే బన్ని సరసన ఆర్య-2, ఎవడు చిత్రాల్లో నటించింది. `సర్ధార్ గబ్బర్‌సింగ్`లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన నటించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చేసి మెగా హీరోయిన్ కాబోతుంది. యాక్టర్స్ అందరూ కన్ఫర్మ్ అవటంతో ఇక సినిమా షూటింగ్ వేగంగా జరగనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మెగా ఫ్యాన్స్ కు చిరు సినిమా నిజమైన సంక్రాంతి పండగ తెచ్చినట్లే.