(ప్రశ్న అడిగిన యువతి వివరాలు లేవు)
డాక్టర్ సమీర్ పారిఖ్ : ఎప్పుడైతే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారో అప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. ప్రస్తుతం మీరు మీ బాయ్ ఫ్రెండ్ వల్ల ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు. కానీ అతనితో ఆ విషయం చెప్పి హర్ట్ చేయకూడదని భావిస్తున్నారు. దీన్ని బట్టి మీరు అతనికి ఎంత గౌరవం ఇస్తున్నారో తెలుస్తోంది. ఇదంతా అతను లిమిట్స్ దాటనంత వరకూ ఓకే. అయితే ఎప్పుడైతే అతను మీ బౌండరీస్ దాటి ప్రవరిస్తున్నాడు అని మీరు అనుకుంటారో అప్పుడు మాత్రం కచ్చితంగా ఈ విషయం గురించి ఇద్దరూ చర్చించండి. ఎదుటి వ్యక్తిపై నమ్మకం ఉంది అనే విషయాన్ని మనం ఎన్నో విధాలుగా వ్యక్తపరచవచ్చు అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. ఏ విషయంలోనైనా అసౌర్యంగా అనిపించినప్పుడు నీవు అసలు భయపడకుండా, హర్ట్ చేయకుండా అతనికి మీకు కలిగే ఇబ్బందిని తెలపండి. దీంతోనే సమస్య పరిష్కారమవుతుంది. - డాక్టర్ సమీర్ పారిఖ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఫోర్టిస్ హెల్త్ కేర్
- మీరు ఇలాంటి ఏదైనా సమస్యకు ఎక్స్ పర్ట్ నుంచి జవాబు కావాలని కోరుకుంటే expertadvice.toi@gmail.com కు మెయిల్ పంపండి. దయచేసి మెయిల్ కేవలం ఇంగ్లీష్ లోనే రాసి పంపండి.
Mobile AppDownload and get updated news