అది కొత్త జీవితం ప్రారంభించాక మొదలయ్యే మొదటి రోజు. అందువల్ల నవ దంపతులు ఫస్ట్ నైట్ రోజున చాలా విషయాలపై చర్చించుకోవాలి. భార్యభర్తల మధ్య తొలి మూడు రోజులు అత్యంత కీలకం. ముఖ్యంగా, ఈ మూడు రోజుల్లోనే వారిమధ్య అవగాహనా లోపం వల్ల మనస్పర్థలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మూడు రోజుల్లో ఏర్పడిన మనస్పర్థలే కాలం గడిచే కొద్దీ పెద్దవై పోతాయి. ఇందులో మొదటి రోజు రాత్రికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే ఆమెతో మొదట ప్రశాంతగా మట్లాడాలి. ఆమె అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకోవాలి. ఇక నుంచి మీరు ప్రారంభించే కొత్త జీవితం ఎలాగుండాలో చర్చించాలి. ఇంత వరకు మీ లైఫ్ సాగిన విధానాన్ని ఆమెకు ఒక్కసారి క్లుప్తంగా వివరించాలి. ఆర్ధిక విషయాలు, ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలను గురించి చెప్పాలి. నీకుండే అలవాట్లను నిజాయితీగా తెలపాలి.
ఇలా మీరు అన్ని విషయాలు మీ భార్యతో చర్చించినట్లయితే ఆమె మీపై ఎక్కువ నమ్మకం, ప్రేమ పెంచుకుంటుంది. మగవారు కొన్ని విషయాలు భార్యలకు తెలపరు. దీంతో భార్యలు భర్తలపై అపనమ్మకం పెంచుకుంటారు. అయినా ఇవన్నీ ఫస్ట్ నైట్ రోజు చర్చించేందుకు టైం ఎక్కడ ఉంటుంది.. ఆ రోజు కార్యకళాపాలు వేరుగా ఉంటాయి కదా అని మాత్రం ప్రశ్నించకండి. అవి అవే. ఇవి ఇవే. ఈ విషయాలు నీకు జీవితాంతం తోడ్పడుతాయని మాత్రం గుర్తుంచుకో. ఫస్ట్ నైట్ రోజున ఇలా చేస్తేనే లైఫ్ అంతా సాఫీగా ఉంటుంది.
Mobile AppDownload and get updated news