సినిమాకు ప్రేక్షకులను ఆకర్శించేందుకు దర్శక-నిర్మాతలు కలిసి కొన్ని సీన్లను ప్రత్యేకంగా చిత్రీకరిస్తే వాటిని సెన్సార్ బోర్డ్ నిర్ధాక్షిణ్యంగా కత్తిరించి పాడేస్తుంది. ఈ విషయంలో సినిమా వాళ్లకు- సెన్సార్ బోర్డుకు మధ్య ఎన్నోసార్లు వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. బాలీవుడ్ సినిమా వారైతే కేంద్ర సెన్సార్ బోర్డుతో ఇటీవల యుద్ధమే చేశారు. ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలో చెలరేగిన వివాదంలో ముంబై హైకోర్ట్ సెన్సార్ బోర్డ్ పని కేవలం సినిమాను సర్టిఫై చేయడం మాత్రమే అని ఘాటుగా వ్యాఖ్యానించడంతో అప్పట్నించీ సెన్సార్ బోర్డ్ కాస్త మెత్తబడ్డట్లే కనిపిస్తోంది. తాజాగా హృతిక్ రోషన్, పూజా హెగ్డె ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన 'మొహెంజో దారో' సినిమాకి సెన్సార్ బోర్డ్ ఎక్కడా కట్ చెప్పలేదు. ఈ సినిమాలో హృతిక్ - పూజాల మధ్య మూడు ఘాడమైన ముద్దుసీన్లతో పాటు, ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది. అయినా సెన్సార్ బోర్డ్ ఎక్కడా కట్ చెప్పకుండా యూ/ఎ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
Mobile AppDownload and get updated news