తెలంగాణ ఎంసెట్ -2 రద్దు అంశాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని టి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు జరిపిన చర్చ కారణంగా దీనిపై ప్రకటన ఆలస్యమైందనట్లు మంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ -2 రద్దు చేసిన మరుక్షణమే ఎంసెట్ -3 ప్రకటన ఉంటుందని.. పరీక్ష తేదీలు వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉంటాయన్నారు. అలాగే 9న తేదీన ఫలితాలు విడుదల చేయాలని షెడ్యూల్ రూపొందించామన్నారు. దీన్ని సీఎం ఆమోదించి.. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశముందని కడియం అన్నారు. ఎంసెట్ నిర్వహించడంలో 20 ఏళ్ల అనుభవం కలిగిన జేఎన్టీయూకే ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.
Mobile AppDownload and get updated news