భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఆయన రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది. నర్సింగ్ తీసుకున్న డ్రింక్ లో ఉత్ప్రేరకాలు కలిపారని నాడా తెలిపింది. నర్సింగ్ యాదవ్ దోషి కాదని నాడా తేల్చింది. నర్సింగ్ యాదవ్‌పై బ్యాన్ తొలగడంతో అతడి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గతంలో నర్సింగ్ డోపీగా తేలడంతో అతడి స్థానంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రవీణ్ రాణా (74 కిలోల)ను ఒలింపిక్స్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఐతే నర్సింగ్ డోప్ పరీక్షలో విజయవంతం కావడంతో ప్రస్తుతం ఇతనే ఆడనున్నారు.
పతకంతో తిరిగొస్తా
''ఆఖరికి నిజమే గెలిచింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదంతాన్ని ఇంతటితో మరిచిపోయి పూర్తిగా ఒలింపిక్స్ పై దృష్టి సారిస్తా. రియో నుంచి పతకంతో తిరిగొస్తా'' అంటూ నర్సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
నీకే నా మద్దతు
''ఇది చాలా సంతోషకర వార్త. నర్సింగ్.. నీకు మొదటి నుంచి నా మద్దతు ఉంది. ఈ రోజూ ఉంది. భవిష్యత్‌లోనూ ఉంటుంది. రియో వెళ్లి దేశం కోసం మాత్రమే కాదు నా కోసం కూడా పతకం గెలువు'' అని సుశీల్ కుమార్ ట్విటర్లో పోస్టు చేశారు.
Mobile AppDownload and get updated news