కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహించేందుకే..
2017 చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తనను పదవి నుంచి తప్పించాలని మోడీ సర్కార్ ను కోరినట్లు ఆనందీ బెన్ వెల్లడించారు. 30 ఏళ్ల పాటు తాను బీజేపీ సిద్ధాంతాలకు లోబడి పనిచేశానని పేర్కొంటూ.. నరేంద్ర మోడీ లాంటి అగ్రస్థాయి నాయకుడితో 18 ఏళ్ల పాటు కలిసి పనిచేసినందుకు తనకు ఎంతో సంతృప్తి ఉందని గుజరాత్ సీఎం వెల్లడించారు. ప్రధాని అభ్యర్ధిగా ప్రమోట్ కావడంతో మోడీ గుజరాత్ సీఎం అభ్య్ధర్థిత్వానికి రాజీనామా చేయడం .. అనంతరం 2014 మే 22 వ తేదీన మోడీ స్థానంలో ఆనందీ బెన్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నరేళ్లు సీఎం బాధ్యతలు చేపడుతున్న ఆమెను పటేళ్ల ఉద్యమం ఇరకాటంలో నెట్టేసింది. తాజాగా గుజరాత్ లో దళితులపై దాడి అంశం ఆమెపై ఒత్తిడిని మరింత పెంచింది. దీంతో ఆమె కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Mobile AppDownload and get updated news