Mobile AppDownload and get updated news
పశ్చిమ బెంగాల్ పేరును బెంగాల్‌గా మార్చడానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పేరు మార్పు విషయమై తీర్మానం చేశారు. ఆ రాష్ట్రం పేరును ఇంగ్లిష్‌లో బెంగాల్‌గా మార్చనుండగా, బెంగాలీలో బంగ్లా లేదా బంగాగా ఉండేలా ప్రతిపాదించినట్లు రాష్ట్ర విద్యాశాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ వెల్లడించారు. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజలు పలికే తీరును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పేరు మార్పుపై చర్చించడానికి ఈ నెల 26న అసెంబ్లీ సమావేశం కానుందని ఆయన చెప్పారు. దీనిపై అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం పేరు మార్చాలంటే ముందుగా అసెంబ్లీ ఆమోదం పొందాలి. తర్వాత దాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించాలి. గతేడాది బెంగాల్లోని ఆరు నగరాల పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.