బంపర్ లాటరీ తగలడంతో ఓ వ్యక్తి ఆఫీస్‌లో వీరంగం సృష్టించాడు. లండన్ లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తికి లాటరీ తగిలిందనే మెసేజ్ వచ్చింది. ఆ ఆనందాన్ని అతడు పట్టలేకపోయాడు. అందరూ తమ పనులు తాము చేసుకుంటుండగా, కుర్చీలోనే ఎగిరి గంతులు వేశాడు. అతడు లేచి అటూ ఇటూ పరుగెత్తడంతో అతడి కొలీగ్స్‌కు ఏమీ అర్థం కాలేదు. ఈ సందర్భం కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడో ఏమో.. ఒక్కసారిగా బాస్‌పై విరుచుకుపడిన అతడు బాస్‌ను కుర్చీలోంచి కిందపడేసి, పిచ్చిపిచ్చిగా కొట్టాడు. ఆయన కింద పడి ఉండగానే టేబుల్ పైకి ఎక్కి అతడిపై మూత్రం పోసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఓ మహిళా ఉద్యోగి మాత్రం ఈ దారుణాన్ని చూడలేక ముఖానికి ఫైల్ అడ్డు పెట్టుకుంది. తర్వాత హ్యాపీగా బయటకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
Mobile AppDownload and get updated news